E-Learning

డిజిటల్ విజ్ఞాన కేంద్రం (గ్రామీణ e విజ్ఞాన వేదిక) లోని అంశములు:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం నందు అధిక సంఖ్యలో సిబ్బంది పనిచేయుచున్నారు. గ్రామ పంచాయతీ చేపట్టు వివిధ పనుల నిమిత్తము మరియు ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల అమలు నిమిత్తం వీరు తమ సమయాన్ని అత్యధికంగా కేటాయిస్తారు. ఈ కారణంగా అతి తక్కువ సమయాన్ని వీరు శిక్షణలకు కేటాయించడం జరుగుతోంది. అందువలన పధకంలో వస్తున్న మార్పులు, కొత్తగా చేపట్టు పనులు, మార్గదర్శకాలు మొదలైన వాటిని వీరికి శిక్షణల రూపంలో బోధించడం కష్టతరముగా మారినది. దీనివలన సిబ్బందిలో సామర్ధ్యం పెంపుదల తగిన స్థాయిలో లేక వారి ప్రతిభా ప్రావీణ్యాలు తగ్గుచున్నవి.

Readmore..

ఈ నేపధ్యంలో తరగతి గదులలో శిక్షణకు అధిక సమయం కేటాయించడం అవసరం లేని విధంగా సమగ్ర సహజ వనరుల యాజమాన్యం క్రింద సామర్ద్యాభివృద్ది చేయడానికి ఒక వేదిక అవసరమైనది.

“గ్రామీణ e విజ్ఞాన వేదిక” అనే పేరుతో సిబ్బంది శిక్షణా అవసరాల నిమిత్తం ఒక వేదికను అభివృద్ది చేయడం జరిగింది.

శిక్షణార్ధులు తమ ఆండ్రాయిడ్ మొబైల్స్, లేదా కంప్యూటర్లను ఉపయోగించడం ద్వారా ఈ వేదికను ఉపయోగించుకుని తమకు అవసరమైన అంశమును తమకు అనుకూలమైన సమయములో నేర్చుకొనుటకు అవకాశం ఉంటుంది.

  • e అంశముల అభివృద్ది : నేర్పవలసిన అంశములను చిత్రములు, ఆడియో, వీడియో, ఫోటోలు, ఆనిమేషన్ లు మరియు చదువుటకు వీలుగా పదాల రూపంలో అంశాలను తయారుచేయడం.
  • డిజిటల్ వెబ్ స్టూడియో : e స్టూడియో ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యం నేర్పవలసిన అన్ని అంశాలను డిజిటల్ రూపంలో మార్చుట, మరియు తరగతిలో చెప్పవలసినటువంటి అన్ని అంశాలను ఆనిమేషన్ వీడియోలుగా మార్చుట తదితర అంశాల నిమిత్తము ఏర్పాటు చేయడం.
  • e అంశాలకోరకు మొబైల్ అప్లికేషన్: డిజిటల్ విజ్ఞాన కేంద్రం నందు పొందుపరచిన e అంశాలు అన్నింటిని శిక్షణార్దులు నేర్చుకొనుట కొరకు మొబైల్ అప్లికేషన్ ఇవ్వడం జరిగినది.
  • నేర్చుకొనుటకు వెబ్ ఆధారిత పోర్టల్: వివిధ రకాల కార్య నిర్వహకాలను నేర్చుకొనుటకు, విజ్ఞానమును పెంపొందించుటకు, సమాచారము పొందుటకు మొదలైనవి...
  • ఎం.ఒ.ఆర్.డి - జి.ఐ.జెడ్ ప్రాజెక్ట్ క్రింద, 14 మాడ్యూల్స్, మొబైల్ అప్లికేషన్, మరియు వెబ్ పోర్టల్ వంటి వాటిని జి.ఐ.జెడ్ వారి సాంకేతిక సహాయంతో అభివృద్ది చేయడం ద్వారా శాశ్వత బోధనా మాధ్యమంగా మిగిలి పోతుంది.

Show less
asads